కన్నులు

కన్నులు వుండు నందరకు కాని – కమనీయ మనోజ్ఞ మాలికల్ కలువలు పూయు కన్ను లవి యెన్ని ? ఎన్నిటి నందు – సు స్నేహ రసార్ద్రతలున్నవి ? వెన్నెల లెన్ని కాయు ? వలపు విచిత్ర భాషణ లెన్ని యెఱుంగు ? ఇన్నిట నొక్కటైన – నెఱి నేర్వని కన్నులు కన్నులౌనె ? రమ్య రసజ్ఞ గుణ శేఖరు లార నిక్కము మీరె తెల్పరే! డిశంబరు 2008 పొద్దు లో ప్రచురింపబడింది http://poddu.net/?p=1322 కన్నులుని చదవడం కొనసాగించండి

దూరం

ఆలోచనా తరంగిణి కా ఒడ్డులో నీవు – ఈ ఒడ్డులో నేను – అలల అలజడిలో వెనుకడుగే ఇద్దరిదీ ! కానీ – కాళ్ళ క్రింది ఇసుకొకటే కాలంలా కరిగిపోతూ కలిపే ప్రయత్నం చేస్తోంది ఇద్దర్నీ !? నవంబరు నెల పొద్దు లో పొద్దు పొడిచిన ఈ కవితను ఈ క్రింది లింకు ద్వారా కూడా చేరుకొవచ్చు.పొద్దు పెద్దలకు ధన్యవాదములతో.. http://poddu.net/?m=200811 దూరంని చదవడం కొనసాగించండి