కన్నులు

కన్నులు వుండు నందరకు కాని – కమనీయ మనోజ్ఞ మాలికల్ కలువలు పూయు కన్ను లవి యెన్ని ? ఎన్నిటి నందు – సు స్నేహ రసార్ద్రతలున్నవి ? వెన్నెల లెన్ని కాయు ? వలపు విచిత్ర భాషణ లెన్ని యెఱుంగు ? ఇన్నిట నొక్కటైన – నెఱి నేర్వని కన్నులు కన్నులౌనె ? రమ్య రసజ్ఞ గుణ శేఖరు లార నిక్కము మీరె తెల్పరే! డిశంబరు 2008 పొద్దు లో ప్రచురింపబడింది http://poddu.net/?p=1322 కన్నులుని చదవడం కొనసాగించండి

దూరం

ఆలోచనా తరంగిణి కా ఒడ్డులో నీవు – ఈ ఒడ్డులో నేను – అలల అలజడిలో వెనుకడుగే ఇద్దరిదీ ! కానీ – కాళ్ళ క్రింది ఇసుకొకటే కాలంలా కరిగిపోతూ కలిపే ప్రయత్నం చేస్తోంది ఇద్దర్నీ !? నవంబరు నెల పొద్దు లో పొద్దు పొడిచిన ఈ కవితను ఈ క్రింది లింకు ద్వారా కూడా చేరుకొవచ్చు.పొద్దు పెద్దలకు ధన్యవాదములతో.. http://poddu.net/?m=200811 దూరంని చదవడం కొనసాగించండి

విశాల హృదయాలు

ప్రపంచం చిన్నదై పోయింది అయితే నేం మా హృదయాలు మాత్రం విశాలం – ఎంతంటే స్వధర్మాన్నే కాదని – పర ధర్మాని కి పట్టం కట్టే టంత ! ప్రపంచీకరణ నేపధ్యం లో దేశానికీ దేశానికీ మధ్య – అడ్డు గోడలు కూలిపోయాయట ఔను – నిజం ! ఆ ఇటుకల తోనేగా మాకూ మాకూ మధ్య కొత్త గోడలు కట్టు కున్నాం ఐతే నేం – మా హృదయాలు మాత్రం విశాలం దేశీయత మా స్వంతం … విశాల హృదయాలుని చదవడం కొనసాగించండి

నేస్తం

మల్లెకు వాసన నేస్తం వెన్నెల జాబిలి నేస్తంభ్రమరానికి పూవులు నేస్తంనేస్తం !ఈ రీతినే మన ఇద్దరి హస్తాల్పెన వేసుకునుం డాలోయ్ఆనందపు టంబుధి పొంగినిండాలోయ్ఈ జగతి సమస్తం !!! నేస్తంని చదవడం కొనసాగించండి

డైరీ

గతమంతా – ఓడైరీ అయితే – గమ్య మెరుగని పయనం లో గతించిన కాలమంతా వ్రాసేసిన పేజీలు – ఎక్కడో – ఎప్పుడో జరిగిన కొన్ని “తీపి జ్ఞాపకాలు” మాత్రం మక్కువ తో – మడచి పెట్టుకొన్న “తెల్ల కాగితాలు”. డైరీని చదవడం కొనసాగించండి